తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన… తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపటి క్రితమే ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన తర్వాత.. తొమ్మది మంది మాజీ ఎమ్మెల్యేల మృతికి సభ సంతాపం తెలిపింది. అనంతరం.. మాజీ ఎమ్మెల్యేల మృతి పట్ల సంతాప తీర్మానం పెట్టింది అసెంబ్లీ.
ఇక.. ఈ అసెంబ్లీ సమావేశాలకు…సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ఎస్ ఎమ్మెల్యేలు, బీజేపీ మరియు కాంగ్రెస్ ఎమ్మెల్యే లు అందరూ హాజరయ్యారు. ఇది ఇలా ఉండగా.. ఈ అసెంబ్లీ సమావేశాలలో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. సంతాప తీర్మాణం అనంతరం అసెంబ్లీ… సోమవారానికి వాయిదా పడింది.
ముఖ్యంగా దళిత బంధు పథకం అమలు, తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు, ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపు, 50 వేల ఉద్యోగాల నియామకం ఇలాంటి విషయాలపై సభ్యులు చర్చించనున్నాయి. కాగా… ఇవాళ జరిగే.. అసెంబ్లీ సమావేశాలకు హాజరై… ఢిల్లీ వెళ్లనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఢిల్లీ లో కేంద్ర హోం మంత్రి మరియు జల వనరుల శాఖ మంత్రులతో భేటీ కానున్నారు సీఎం కేసీఆర్.