బ్రేకింగ్; ఏపీ పోలీసులకు షాక్ ఇచ్చిన హైకోర్ట్…!

-

ఆంధ్రప్రదేశ్ పోలీసులపై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమరావతిలో పోలీసుల అనుచిత ప్రవర్తనపై పత్రికల్లో వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించింది హైకోర్ట్. రాజధాని గ్రామాల్లో సెక్షన్ 144, 30 యాక్ట్ పై దాఖలైన 9 పిటీషన్లను హైకోర్ట్ విచారించింది. మహిళలపై అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై కేసులు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించిన కోర్ట్, వారిపై ఎం చర్యలు తీసుకున్నారని అడ్వకేట్ జనరల్ ని ప్రశ్నించింది.

రాజధాని గ్రామాల్లో మార్చ్ ఫాస్ట్ పై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు రోజుల క్రితం విజయవాడ కనకదుర్గ గుడికి మహిళలు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొందరిపై లాఠీ చార్జ్ కూడా చేసారు పోలీసులు. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాటుగా కొన్ని ఫోటోలను పత్రికలూ ప్రచురించాయి. వీటిని పరిశీలించిన హైకోర్ట్ వాటిని సుమోటో గా స్వీకరించింది.

అటు జాతీయ మహిళా కమీషన్ కూడా రావడంపై హైకోర్ట్ వివరాలు అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. అదే విధంగా ఫోటోలలో కనపడుతున్న పోలీసులపై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇటీవల మహిళలపై విజయవాడలో, అమరావతి ప్రాంతంలో పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై ప్రమాణ పత్రం దాఖలు చెయ్యాలని హైకోర్ట్, అడ్వకేట్ జనరల్ ని ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version