Breking : ఆటో, క్యాబ్‌లు బంద్‌.. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ

-

నేటి అర్ధరాత్రి నుంచి హైదరాబాద్‌లో ఆటోలు, క్యాబ్‌లు, లారీలు సేవలు నిలిచిపోనున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం నూతన మోటర్ వాహనాల చట్టం 2019 అమలు చేస్తూ జరిమానాల పేరుతో ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్లను నిలుపుదోపిడీ చేస్తోందని డ్రైవర్స్ జేఏసీ మండిపడుతోంది. ప్రభుత్వం న్యూమోటర్ వెహికల్ చట్టం 2019ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఒక్కరోజు వాహనాల బంద్‌కు పిలుపునిచ్చారు ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్స్‌ యూనియన్ జేఏసీ నేతలు. అంతే కాదు ఫిట్‌నెస్, లేట్ ఫీజు పేరుతో రోజుకు 50రూపాయలు వసూలు చేయడంపై తీవ్రంగా మండిపడుతున్నారు డ్రైవర్లు.

పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్‌, ధరలతో భారంగా వాహనాలు నడుపుతున్న తమపై అదనపు భారం మోపడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం ట్రాన్స్‌పోర్టు భవన్‌ ముట్టడికి పిలుపునిచ్చింది. ఖైరతాబాద్‌ చౌరస్తా నుంచి ట్రాన్స్‌పోర్ట్‌ భవన్‌ వరకు డ్రైవర్ల యూనియన్‌ జేఏసీ భారీ ర్యాలీగా వెళ్లి తమ నిరసన తెలియజేస్తామని ప్రకటించింది. అయితే ఈ నేపథ్యంలో నేటి అర్థరాత్రి నుంచి ఆటోలో, క్యాబ్‌ల బంద్‌ దృష్ట్యా.. ప్రత్యేక ఆర్టీసీ బస్సులను గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో నడుపనున్నట్లు టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. కావున ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆర్టీసీ పేర్కొంది. అంతేకాకుండా మరిన్ని వివరాలకు.. 9959226160, 9959226154 నెంబర్లలో సంప్రదించవచ్చునని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version