జమ్ముకాశ్మీర్‌లోని టూరిస్టు స్పాట్ పహెల్గాం జిల్లాలో నలుగురు ఉగ్రవాదులు విచక్షణా రహింతంగా జరిపిన కాల్పుల్లో 28 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే.ఈ దాడిలో నేవి అధికారి లెఫ్టినెంట్ నర్వాల్ సైతం ప్రాణాలు కోల్పోయాడు. నిన్న సాయంత్రం అధికార లాంఛనాలతో నర్వాల్‌కు అంత్యక్రియలు జరిగాయి.
అనంతరం మీడియాతో నర్వాల సోదరి మాట్లాడుతూ కన్నీరుమున్నీరయ్యారు. ఆర్మీ సెక్యూరిటీ వాళ్ళు సమయానికి అక్కడికి వచ్చుంటే మా అన్న బ్రతికే వాడు అని ఆవేదన వ్యక్తంచేశారు.మా అన్న గంటన్నర పాటు ప్రాణాలతో బ్రతికే ఉన్నాడు అని..మా అన్నను చంపిన ఉగ్రవాది తల తెచ్చి మాకు న్యాయం చేయండి అంటూ ఉగ్రదాడిలో మరణించిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ చెల్లి రోదించారు.
ఆర్మీ సెక్యూరిటీ వాళ్ళు సమయానికి అక్కడికి వచ్చుంటే మా అన్న బ్రతికే వాడు
మా అన్న గంటన్నర పాటు ప్రాణాలతో బ్రతికే ఉన్నాడు
మా అన్నను చంపిన ఉగ్రవాది తల తెచ్చి మాకు న్యాయం చేయండి అంటూ ఉగ్రదాడిలో మరణించిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ చెల్లి ఆవేదన https://t.co/r9WPFnVaEN pic.twitter.com/oggQIIubW9
— Telugu Scribe (@TeluguScribe) April 24, 2025