అఘోరీ శ్రీనివాస్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. అఘోరీ శ్రీనివాస్ ను మహిళా జైలు కు తరలించారు. ఉమెన్ ట్రాన్స్ జెండర్ కావడంతో చంచల్ గూడ మహిళా జైలు కు తరలించారు పోలీసులు. యూపీ లో అరెస్ట్ చేసి నిన్న హైదరాబాద్ కు తీసుకొచ్చారు పోలీసులు.

నిన్న సాయంత్రం అఘోరీని రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం చంచల్ గూడ మహిళా జైలు లో అఘోరీ ఉన్నారు. మరో వైపు వర్షిణి నీ భరోసా సెంటర్ కు తరలించారు. అయితే, అఘోరీ అరెస్టుపై ఆమె తరఫు న్యాయవాది బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో బెయిల్ ఎప్పుడు వస్తుందో చెప్పలేమని అన్నారు.చీటింగ్ కేసు కాబట్టి ఏ విధంగా చర్యలు తీసుకుంటారో కూడా చెప్పలేమన్నారు అఘోరీకి పదేళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉంటుందని తెలిపారు. తనకు కేసు పేపర్లు మాత్రమే అఘోరీ ఇచ్చిందని..ఎలాంటి విషయాలు చెప్పలేదన్నారు.అఘోరీ న్యాయస్థానాన్ని కూడా తప్పుతోప పట్టిస్తుందని ఆమె తరఫున లాయర్ వెల్లడించారు.