ఏపీ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్ లు వస్తాయో అర్ధం కాకుండా ఉంది…అసలు అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీల మధ్య ఎలాంటి వార్ నడుస్తుందో చెప్పాల్సిన పని లేదు. నువ్వా-నేనా అన్నట్లు రెండు పార్టీల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది. సరే అధికార-ప్రతిపక్ష పార్టీలు అన్నాక ఇలాంటి రాజకీయం కామన్. కానీ ఇక్కడే ఉన్న మరో ట్విస్ట్ ఏంటంటే…ఒకరిపై ఒకరు రాజకీయంగా తలపడుతూనే….వారిలో వారు గొడవలు కూడా పడుతున్నారు. అంటే సొంత పార్టీల్లోనే తగాదాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పుడు అధికార వైసీపీలో నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే పరిస్తితి కనిపిస్తోంది. సొంత పార్టీలోనే ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో ఉంది. సొంత వాళ్ళనే ఓడించేందుకు కొందరు వైసీపీ నేతలు పనిచేస్తున్నారు. ఇదంతా వైసీపీలో జరుగుతున్న రచ్చ.
అయితే తెలుగుదేశం పార్టీలో కూడా తగాదాలు ఉన్నాయి…కాకపోతే సీట్ల గురించి తమ్ముళ్ళు తగాదాలు పడుతున్నారు. ఎవరికి సీటు దక్కించుకునేందుకు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు టీడీపీ చాలావరకు పికప్ అయిందని చెప్పొచ్చు…నేతలంతా యాక్టివ్ అయ్యారు…వైసీపీకి ధీటుగా పనిచేస్తున్నారు. ఇక ఈ వయసులో కూడా చంద్రబాబు కష్టపడి పనిచేసి…మళ్ళీ పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
అంతా బాగానే ఉంది…కానీ కొన్ని నియోజకవర్గాల్లో సీట్ల కోసం తమ్ముళ్ళ మధ్య రచ్చ నడుస్తోంది. గుడివాడ, కైకలూరు, విజయవాడ వెస్ట్, అనంతపురం, ధర్మవరం, సత్తెనపల్లి, గుంటూరు వెస్ట్, నరసారావుపేట, చింతలపూడి, కొవ్వూరు, నిడదవోలు, భీమిలి, నెల్లిమర్ల, కురుపాం, చిత్తూరు…ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నేతల మధ్య సీటు గురించి పోరు నడుస్తోంది. ఇక వీరి సీటు తగాదాలు ఇలాగే నడిస్తే…పార్టీకే డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంది…పార్టీని గాడిలో పెట్టి మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్న చంద్రబాబుని జగన్ పై గెలవనివ్వకుండా చేసేలా ఉన్నారు. అయితే చంద్రబాబే ఈ తగాదాలని సరి చేసి పార్టీని లైన్ లో పెట్టాలి…లేదంటే మళ్ళీ అధికారానికి దూరం కావాల్సి వస్తుంది.