దక్షిణ తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇవాళ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి SLBC ప్రాజెక్టును సందర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని వెల్లడించారు.
కాంగ్రెస్ హయాంలోనే ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశామని.. కాంగ్రెస్ హయాంలో 75 శాతానికి పైగా పనులు చేశామని కేవలం 25 శాతం పనులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఈ పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే.. ఉమ్మడి నల్లగొండ జిల్లా సస్యశ్యామలంగా ఉండేదన్నారు. గోదావరి కృష్ణా కలుపుతామని హామీలు ఇచ్చారని.. కానీ ఆ హామీలు అన్ని తుంగలో తొక్కారని.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే.. అది నాణ్యత లేక కుంగిపోయిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి ఏం జరగలేదని తెలిపారు.