2019-2024 లో ఉన్న సీఎం ని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

-

2019-2024 లో ఉన్న సీఎం ని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదని.. గత సీఎం పరదాల చాటునకు వెళ్లేవాడని  సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ప్రకాశం జిల్లాలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు చంద్రబాబు. మొట్ట మొదటిసారిగా పెన్షన్లు పెట్టింది ఎన్టీఆర్ గారు. ఐదేళ్లలో రూ.200 నుంచి రూ.2000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. 2024లో రూ.3000 నుంచి రూ.4000 పెన్షన్లు పెంచామని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో సంపద సృష్టిస్తేనే.. ఆదాయం పెరుగుతుందన్నారు. ఒకరోజు ముందుగానే పెన్షన్లు ఇస్తున్నాం అని తెలిపారు. 

 గతంలో ఎప్పుడూ చూడని వరదలు ఈ ఏడాది చూశాం. ఈ ప్రభుత్వం పేదల కోసమే ఉంది. కొంత మంది సైకోలు తయారయ్యారు. ప్రభుత్వం అంటే లెక్కలేని తనం అయింది. కొంత మంది అధికారులు తప్పుడు సర్టిఫికెట్లు ఇస్తున్నారని.. తన దృష్టికి వచ్చింది.  తప్పు చేసిన వారి తాటా తీస్తానని హెచ్చరించారు. ముగ్గురు పేదల ఇంటికి వెళ్లాను. వారి పరిస్థితులను అడిగి వారి బాధలను విన్నాను. వారి సమస్యలను పరిష్కరించనున్నట్టు హామీ ఇచ్చారు. వారి ముగ్గురికి ఇండ్లు మంజూరు చేయాలని కలెక్టర్ కి చెప్పానని తెలిపారు చంద్రబాబు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version