ఎమ్మెల్యేల అనర్హత పై సుప్రీం కోర్టులో బీఆర్ర్ఎస్ రెండు పిటిషన్లు దాఖలు చేసింది. ముఖ్యంగా ఏడుగురు ఎమ్మెల్యేల పై రిట్ పిటిషన్ వేసింది. ముగ్గురు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లాం వెంకట్రావు పై SLP వేసింది బీఆర్ఎస్.
ఎమ్మెల్యేల అనర్హత పై స్పీకర్ / సెక్రటరీ లు వెంటనే చర్యలు తీసుకునేలా, టైం ఫిక్స్ చేసేలా సుప్రీం కోర్టు ఆదేశించాలని పిటిషన్లు దాఖలు చేశారు. హైకోర్టు తీర్పు ఇచ్చి 6 నెలలైనా ఇప్పటికీ స్పీకర్ చర్యలకు ఉపక్రమించలేదని బీఆర్ఎస్ తెలిపింది. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని పిటిషన్లో పేర్కొంది. గతంలో కేశం మేఘా చంద్ర కేసులో ఇచ్చిన తీర్పు అమలుచేయాలని కోరింది. పార్టీల ఫిర్యాదులపై స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం చెప్పాలని కేశంbమేఘా చంద్ర కేసులో తీర్పు రాగా మేఘా అందుకు అనుగుణంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదని ఆరోపించింది. 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది.