తాను చేసిన విలీనాలు హరీష్ రావు మర్చిపోయాడు : బల్మూరి వెంకట్

-

మాజీ మంత్రి హరీష్ రావు పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫైర్ అయ్యారు. హరీష్ రావు గతంలో చేస్తున్న దానికి ఇప్పుడు చేస్తున్నాదానికి ఏమైనా పొంతన ఉందా అని ప్రశ్నించారు. గతంలో మీరు చేసిన దొంగతనాలు, విలీనాలు మర్చిపోయి.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల పై పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఈ పని చేయడానికి కొంచెమన్నా సిగ్గుండాలి అని బల్మూరి వెంకట్ పేర్కొన్నారు.

అయితే ఏడుగురు శాసన సభ్యులపై అనర్హులుగా ప్రకటించాలని హరీష్ రావు అంటుండు. అయితే కేసీఆర్ ఆరోజు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినప్పుడు హరీష్ రావు ఎందుకు మాట్లాడలేదు. మీ ప్రభుత్వ హాయంలో ప్రతిపక్షం లేకుండా చేసి మీ పార్టీలో విలీనం చేసుకున్నారు. అప్పుడు ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న స్కీంలను ప్రజలు హర్షిస్తుంటే.. కాంగ్రెస్ పరిపాలనను మీరు మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే.. ప్రజా ప్రభుత్వాన్ని బలపరచాలని మీ పార్టీ ఎమ్మెల్యేలు మా కాంగ్రెస్ లో చేరుతున్నారు అని బల్మూరి వెంకట్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version