కొత్తగూడెంలో కారుకు చిక్కులు..అభ్యర్ధి మారతారా?

-

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద పట్టు లేని విషయం తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ వచ్చాక కూడా అక్కడ కారు పార్టీకి పట్టు దొరకడం లేదు. గత ఎన్నికల్లో జిల్లాలో 10 సీట్లు ఉంటే బి‌ఆర్‌ఎస్ మాత్రం కేవలం ఒక సీటు గెలుచుకుంది. అంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే తర్వాత కాంగ్రెస్ నుంచి గెలిచిన నలుగురు, టి‌డి‌పి నుంచి ఇద్దరు, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలని బి‌ఆర్‌ఎస్ లోకి లాక్కున్నారు. దీంతో జిల్లాలో కారుకు కాస్త బలం పెరిగింది.

అయితే ఇంకా జిల్లాలో కొన్ని స్థానాల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీకి బలం కనిపించడం లేదు. పైగా ఎక్కడకక్కడ ఆధిపత్య పోరు కనిపిస్తుంది. దీని వల్ల బి‌ఆర్‌ఎస్ పార్టీకి నష్టం ఎక్కువ ఉందనే చెప్పాలి. ఇదే క్రమంలో కొత్తగూడెం నియోజకవర్గంలో బి‌ఆర్‌ఎస్ పరిస్తితి ఆగమ్య గోచరంగా ఉంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఉన్నారు..ఈయన గతంలో కాంగ్రెస్ నుంచి అనేక సార్లు విజయం సాధించారు. గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నుంచి గెలిచి బి‌ఆర్‌ఎస్ లోకి వెళ్లారు.

 

అయితే అలా బి‌ఆర్‌ఎస్ లోకి వెళ్ళిన వనమా పరిస్తితి పెద్దగా బాగోలేదు..ఆయన తనయుడు రాఘవ చేసిన పనులు చాలా నష్టం చేశాయి. దీంతో నెక్స్ట్ ఎన్నికల్లో వనమాకు సీటు కష్టమనే పరిస్తితి. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్ రావు ఇక్కడ సీటు ఆశిస్తున్నారు. ఇంకా పలువురు నేతలు కూడా కొత్తగూడెం సీటుపై కన్నేశారు.

దీని వల్ల కొత్తగూడెం బి‌ఆర్‌ఎస్ లో ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇది పార్టీకి చాలా నష్టం చేసేలా ఉంది. అదే సమయంలో ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉంది. అయితే ఇక్కడ కమ్యూనిస్టులకు బలం ఉంది. వారు ఏమో బి‌ఆర్‌ఎస్ కు మద్ధతు ఇస్తున్నారు. కాబట్టి కొత్తగూడెంలో ఏదైనా జరగవచ్చు. చూడాలి మరి ఈ సారి కొత్తగూడెం ఎవరి వశం అవుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version