ఉప రాష్ట్రపతి ఎన్నికను బహిష్కరిస్తున్నామని బీఆర్ఎస్ పార్లమెంటరీ నాయకుడు సురేష్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో రైతులకు ఎరువుల సమస్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం వల్లే ఈ నిర్ణయం అన్నారు. ఇద్దరు అభ్యర్థులు సమర్థవంతులు.. వారిపై గౌరవం ఉందని వివరించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా మాత్రమే బహిష్కరణ నిర్ణయం అన్నారు సురేష్ రెడ్డి. ఇది ఇలా ఉండగా… నేడే ఉప రాష్ట్రపతి ఎన్నిక ఉండనుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు ఉప రాష్ట్రపతి ఎన్నిక ప్రారంభం కానుంది. ఇక ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ముగియనుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి తరఫున జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు.