ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇవాల్టి నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు ఈ మ్యాచ్ కొనసాగనుంది. మొత్తం 8 జట్లు ఈ టోర్నమెంట్లో కొనసాగుతాయి. పాకిస్తాన్ అలాగే టీమిండియా కూడా గ్రూప్ ఎ లో ఉన్నాయి.

ఈ రెండు జట్ల మధ్య సెప్టెంబర్ 14వ తేదీన కీలక మ్యాచ్ కూడా ఉంది. UAE వేదికగా జరగబోతున్న ఈ టోర్నమెంట్ లో భాగంగా మొదటి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ హాంగ్కాంగ్ మధ్య ఆధారం ఉంది. టి20 ఫార్మాట్లో జరగనున్న ఈ మ్యాచ్… సాయంత్రం 8 గంటలకు ప్రారంభమవుతుంది. రేపు యూఏఈతో టీమిండియా పోరు ఉంటుంది.
భారతదేశంలో, అన్ని Asia Cup 2025 మ్యాచ్‌లు Sony Sports Network TV ఛానెళ్లలో (Sony Sports 1, 3, 4, 5 ) అన్ని భాషల్లో ప్రత్యక్ష ప్రసారంగా ప్రసారం అవుతాయి. డిజిటల్ స్ట్రీమింగ్ మాత్రం Sony LIV ప్లాట్‌ఫారమ్ (యాప్ & వెబ్‌సైట్) ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి.