సంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య.. గోనె సంచిలో మూటకట్టి చెట్ల పొదల్లో!

-

సంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య జరిగింది. జిల్లాలోని సీడ్ ఫ్యాక్టరీలో ఇన్‌చార్జిగా పనిచేస్తున్న నారాయణ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి గోనె సంచిలో మూటగట్టి హత్నూర మండలంలోని రెడ్డి ఖానాపూర్ శివారులో పడవేశారు. అయితే, కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం మల్లు పల్లి గ్రామానికి చెందిన నారాయణ గత కొన్నాళ్ల కిందట సంగారెడ్డికి వలసొచ్చి సీడ్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు సమాచారం.

డోర్పట్ల గ్రామ శివారులోని డంపింగ్ యార్డ్ వద్ద విపరీతంగా దుర్వాసన వస్తుండటంతో డెడ్ బాడీని గమనించిన బాటసారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు చనిపోయింది నారాయణగా గుర్తించారు. కాగా, మృతుని భార్య మూడు రోజుల కిందట హత్నూర పీఎస్‌లో తన భర్త కనిపించడం లేదని కేసు పెట్టినట్లు తెలిసింది.అసలు నారాయణను ఎవరు? ఎందుకు హత్య చేశారన్న విషయం మిస్టరీగా మిగిలింది. కాగా, ఈ మర్డర్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version