ట్యాంక్‌బండ్‌లో యువకుడు మిస్సింగ్ అయ్యాడు. నిన్న అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఒక బోటులో ఫ్రెండ్స్‌తో వచ్చిన అజయ్(21) అనే యువకుడు మిస్ అయ్యాడు. అజయ్ మిస్సింగ్‌తో కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. భారతమాతకు మహాహారతి కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. నిన్న అర్థరాత్రి హుస్సేన్‌సాగర్‌లో రెండు బోట్లలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. టపాసులు కాలుస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
దీంతో ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. అటు హుస్సేన్‌సాగర్‌లో ఉన్న రెండు బోట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. నిన్న అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఒక బోటులో ఫ్రెండ్స్‌తో వచ్చిన అజయ్(21) అనే యువకుడు మిస్ అయ్యాడు. దీనిపై అజయ్ స్నేహితులు మాట్లాడారు. ట్యాంక్ బండ్ లో పోలీస్ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నరు… అగ్నిప్రమాదం జరిగినప్పుడు మేము బయటే ఉన్నాము బోట్ లో లేమని తెలిపారు. హుస్సేన్ సాగర్ లో అజయ్ కోసం పోలీస్ రెండు బృందాల రెస్క్యూ ఆపరేషన్ చేశారని… భరతమాతకు మహా హారతి కార్యక్రమం చూడడానికి అజయ్ తో పాటు వచ్చామన్నారు. మాతో పాటు చూడడానికి వచ్చిన అజయ్ కనబడలేదని… ఫోన్ స్విచ్ అఫ్ వస్తుందని వివరించారు. అజయ్ నిన్న రాత్రి నుండి కనబడదం లేదన్నారు.