BREAKING : బీఎస్‌ఎఫ్ జవాన్ కాల్పులు..5 గురు సైనికులు మృతి, 10 మందికి గాయాలు

-

అమృత్‌సర్‌లోని ఖాసా గ్రామంలో దారుణంలో చోటు చేసుకుంది. బీఎస్‌ఎఫ్ జవాన్ చేసిన కాల్పులలో..ఏకంగా తన తోటి సైనికులు ఐదుగురు మృతి చెందగా.. 10 మందికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటన కాసేపటి క్రితమే చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. ఎప్పటి లాగే.. అమృత్‌సర్‌లోని BSF మెస్‌లో అందరూ టిఫిన్‌ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే.. ఓ బీఎస్‌ఎఫ్ జవాన్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో కానిస్టేబుల్‌తో సహా ఐదుగురు సరిహద్దు భద్రతా దళాల (BSF) జవాన్లు మరణించినట్లు సమాచారం అందుతోంది. అలాగే.. మరో 10 మందికి గాయాలు కాగా… గాయపడిన వారిలో ఒక జవాన్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం నలుగురు బీఎస్ఎఫ్ జవాన్ల మృతదేహాలు ఆస్పత్రికి చేరుకున్నాయి. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఇక ఈ కాల్పుల్లో గాయపడిన వారందరినీ గురునానక్ దేవ్ ఆసుపత్రిలో చేర్చారు. అటు దీనిపై కేసు నమోదు చేసుకుంది…. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version