బోర్డర్ దాటి భారత్ లో అడుగుపెట్టిన పాక్ వ్యక్తిని బీఎస్ఎఫ్ జవాన్లు ఏం చేశారంటే?

-

సల్మాన్ ఖాన్.. భజరంగీ భాయ్ జాన్ సినిమా చూశారా మీరు. ఆ సినిమాలో పాక్ చెందిన బాలిక బోర్డర్ దాటి భారత్ కు వస్తుంది. తనను పాక్ కు పంపించడానికి హీరో ఎంతో కష్టపడతాడు. సేమ్ టు సేమ్ అలాంటి ఘటనే నిజంగా జరిగింది. పాక్ దేశస్థుడు పొరపాటున బోర్డర్ దాటి భారత్ లో అడుగుపెట్టాడు. పాకిస్థాన్ కు చెందిన 60 ఏళ్ల వ్యక్తి జమ్ము కశ్మీర్ లోని సాంబా జిల్లాలో ఉన్న పాక్ సరిహద్దును దాటి భారత భూభాగంలోకి అడుగుపెట్టాడు.

బోర్డర్ వద్ద కాపలా కాస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లు భారత్ లో అడుగుపెట్టిన ఆ వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నాయి. అతడిని ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లి విచారించగా.. తాను పొరపాటుగా భారత్ లోకి అడుగుపెట్టానని ఒప్పుకున్నాడు. దీంతో అతడిని బీఎస్ఎఫ్ జవాన్లు తిరిగి పాకిస్థాన్ బలగాలకు అప్పగించారు.

అంతర్జాతీయ సరిహద్దుల వద్ద శాంతి, ప్రశాంతతకు చిహ్నంగా ఈ ఘటనను చెప్పుకోవచ్చని సైనికులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని రోజుల కింద పాక్ ఆర్మీకి చిక్కిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అభినందన్ ను పాక్.. తర్వాత భారత్ కు అప్పగించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిడి, భారత దౌత్యం ఫలించడంతో అభినందన్ ను పాక్.. భారత్ కు అప్పగించింది. తాజాగా… పాక్ చెందిన వ్యక్తిని భారత్.. పాక్ కు అప్పగించడంతో అంతర్జాతీయ సరిహద్దుల వద్ద స్నేహపూర్వక వాతావరణం ఉంటే ఎటువంటి సమస్యలు రావని జవాన్లు చెబుతుండటం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version