మూడు రాజధానుల విషయంలో ప్రజాభిప్రాయం తీసుకోవాలి: బుద్ధ వెంకన్న

-

రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం రాజకీయంగా మరో చిచ్చు మొదలైంది. టీడీపీ నేతలు వైస్సార్సీపీ ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. వాటిని తిప్పికొడుతూ కౌంటర్ అటాక్ వైస్సార్సీపీ నాయకులు ఇచ్చే పనిలో ఉన్నారు. ఇదే నేపథ్యంలో మంత్రి కొడాలి నాని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ జిల్లాలో కేవలం టీడీపీ పార్టీ నుంచి ఇద్దరి గెలిచారని, అది కూడా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ మాత్రమే అని అన్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఉన్న 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పటికీ గెలిచే అవకాశాలు లేవని ఎద్దేవా చేశారు.

Buddha-Venkanna

ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న టీడీపీ లో ఉన్న 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారు. వారితో పాటు వైస్సార్సీపీ పార్టీ మొత్తం రాజీనామా చేసి ఎన్నికల పోరులో నిలబడాలని అన్నారు. సభను మొత్తం రద్దు చేస్తూ రాజధాని విషయంలో ప్రజలు ఏమి కోరుకుంటున్నారని ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని అన్నారు. మూడు రాజధానులు కావాలంటే మళ్లీ ఎన్నికల్లో నిలబడి అప్పుడు తేల్చుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version