కేశినేని నాని తీసుకున్న అప్పు చెప్పగలడా: బుద్ధా వెంకన్న

-

కేశినేని నాని అవినీతి పరుడు. నిరూపించడానికి మేం సిద్దం అంటూ కామెంట్స్ చేసారు బుద్ధా వెంకన్న. నాని బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పెంత, మళ్ళీ కట్టింది ఎంత అని అన్నారు వెంకన్న. తీసుకున్న బ్యాంకుల అప్పుల వివరాలు కేశినేని నాని వెల్లడించగలరా అన్నారు. అలానే కేశినేని నాని కబ్జాలు చేశారు. కేశినేని నానికి భయం మొదలైందని అన్నారు. తన ఆస్తులు ఎనికేపాడులో ఉన్నాయి కనుక గన్నవరం నుండి నాగార్జున సాగర్ మధ్య లో రాజధాని ని ఏర్పాటు చేయమని చెప్పాడు అని వెంకన్న అన్నారు.

టీడీపీలో ఉండగా ఇన్ఛార్జీలను పక్కన పెట్టుకునే వాడు కాదని అన్నారు. ఇవాళ తాను పాల్గొన్న కార్యక్రమం లో దేవినేని అవినాష్ ని అతను పక్కన పెట్టుకున్నారు అన్నారు. అవినాష్ పక్కన లేకుంటే తంతారని కేశినేని నానికి భయం మొదలు అయింది అని అన్నారు. సూర్యకాంతం పేరు ఆడపిల్లలకు పెట్టడానికి ఎలా భయపడతారో.. నాని పేరు మగపిల్లలకు పెట్టడానికి భయపడుతున్నారు అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version