బుద్ధా వెంకన్న ఇంటికి పోలీసులు.. అరెస్ట్ చేసే అవకాశం…!

-

ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి. గుడివాడ క్యాసినో వివాదంతో మొదలైన రచ్చ పరస్పర దూషణలు, వార్నింగ్ ల దాకా వెళ్లింది. మంత్రి కోడాలి నాని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని తీవ్ర్ంగా విమర్శించడంతో.. తెలుగు తమ్ముళ్లు కూడా అంతే స్థాయిలో కోడాలి నానికి వార్నింగ్ లు ఇస్తున్నారు. ఈరోజు ఉదయం టీడీపీ నేత బుద్ధా వెంకన్న.. మంత్రి కోడాలి నానికి తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు ఇంటి గేట్ టచ్ చేస్తే కోడాలి నాని శవాన్ని పంపిస్తా అని వార్నింగ్ ఇచ్చారు బుద్ధా  వెంకన్న. విజయవాడలో నువ్వు ఏ సెంటర్ చెప్పినా సరే.. పోలీసులు లేకుండా రా.. ఇద్దరం చూసుకుందాం అంటూ కోడాలి నానికి సవాల్ విసిరారు. మరోవైపు డీజీపీ పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. క్యాసినో వ్యవహారంలో డీజీపీకి కూడా వాటాలు ఉన్నాయన్నట్లు విధంగా బుద్ధా వెంకన్న వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో బుద్దా వెంకన్న కేసు నమోదైంది. పోలీసులు బుద్దా వెంకన్న నివాసానికి వెళ్లారు. మంత్రి కోడాలి నాని ,డీజీపీపై చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరనున్నారు. దీంతో బుద్ధా వెంకన్న ఇంటి దగ్గర ఇటు పోలీసులు, అటు టీడీపీ కార్యకర్తలు భారీగా మోహరించారు. అయితే విమర్శలపై సరైన వివరణ ఇవ్వకుంటే బుద్ధా వెంకన్నను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. అయితే తాను అన్నింటికి తెగించి ఉన్నానని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version