LIC గుడ్ న్యూస్… బ్రతికినంత కాలం ప్రతీ నెలా డబ్బులే.. ఎలా అంటే..?

-

లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ LIC ఎన్నో రకాల ప్రయోజనాలని కలిపిస్తోంది. ముఖ్యంగా దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చి ఆర్ధిక ఇబ్బందులని తగ్గిస్తోంది. అయితే LIC ఎన్నో రకాల పాలసీలని ఇస్తోందన్న సంగతి తెలిసిందే. అయితే ఆ పాలసీల్లో సరల్ పెన్షన్ కూడా ఒకటి.

LIC

ఈ పాలసీ లో డబ్బులు పెడితే మంచిగా లాభాలు వస్తాయి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. సరల్ పెన్షన్ ప్లాన్‌లో ఒక్కసారి ప్రీమియం చెల్లించాలి. అంతే నెక్స్ట్ నుండి మీరు పెన్షన్ తీసుకోచ్చు. ఏడాదికి కనీసం రూ.12 వేల వరకు పొందే డబ్బులు పొందే అవకాశం వుంది. అయితే మీ పెన్షన్ అనేది మీరు కట్టిన దాని బట్టీ ఉంటుంది గుర్తు పెట్టుకోండి.

ఇది ఇలా ఉంటే ఈ పాలసీ లో రెండు పద్ధతులు వున్నాయి. ఒకటేమో లైఫ్ యాన్యుటీ విత్ రిటర్న్ ఆఫ్ 100 పర్సెంట్ పర్చేజ్ ప్రైస్. దీనిలో పెన్షన్ లైఫ్ లాంగ్ వస్తుంది.పాలసీదారుడు మరణించిన తర్వాత ప్రీమియం మొత్తాన్ని మళ్లీ నామినీకి తిరిగి చెల్లిస్తారు. ఈ ప్లాన్‌ను కేవలం ఒకరు మాత్రమే ఎంచుకోగలరు.

అదే ఒకవేళ లైఫ్ లాస్ట్ సర్వైవర్ యాన్యుటీ విత్ రిటర్న్ 100 పర్సెంట్ పర్చేజ్ ప్రైస్ అనేది ఎంచుకుంటే భార్యాభర్తలు ఇద్దరికీ పెన్షన్ వస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ మరణించిన తర్వాత ప్రీమియం డబ్బులు నామినీకి ఇస్తారు. ఏడాదికి కనీసం రూ.12 వేలు పొందొచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది ఇలా పెన్షన్ పొందొచ్చు. ఇక ఎవరు ఈ పాలసీకి అర్హులు అన్నది చూస్తే.. 40 నుంచి 80 ఏళ్ల మధ్యలో వయసు కలిగిన వారు దీనిని తీసుకోచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version