అల్లు స్టూడియోస్ కోసం అన్ని కోట్లా?

-

టాలీవుడ్‌లో మ‌రో కొత్త స్టూడియోకు శ్రీ‌కారం చుట్టారు అల్లు ఫ్యామిలీ. ఇటీవ‌ల స్వ‌ర్గీయ అల్లు రామ‌లింగ‌య్య 99వ జ‌యంతి వేడుక‌ల సంద‌ర్భంగా `అల్లు స్టూడియోస్‌` పేరుతో ఓ భారీ ఫిల్మ్ స్టూడియోని నిర్మించ‌బోతున్నామంటూ అల్లు ఫ్యామిలీ మెంబ‌ర్స్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అల్లు అర‌వింద్‌, అల్లు బాబీ, అల్లు అర్జున్‌, అల్లు శిరీష్ ఈ విష‌యాన్ని అధికారికంగా మీడియాకు ప్ర‌క‌టించారు.

హైద‌రాబాద్‌లోని గండిపేట్ ప్రాంతంలో దాదాపు ప‌దెక‌రాల స్థ‌లంలో ఈ స్టూడియోని నిర్మించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాలు కూడా నిర్వ‌హించారు. అతిత్వ‌ర‌లోనే స్టూడియోకి సంబంధించిన నిర్మాణ ప‌నులు ప్రారంభం కాబోతున్నాయి. స్టూడియో నిర్మాణం కోసం అల్లు ఫ్యామిలీ 80 కోట్లు ఖ‌ర్చు చేయ‌బోతున్న‌ట్టు తెలిసింది.

చిన్నచిన్న పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స్టూడియోలు.. అలాగే `ఆహా` ఓటీటీ కోసం జ‌రిపే వెబ్ సిరీస్‌ల నిర్మాణం కూడా ఇదే స్టూడియోలో జ‌ర‌ప‌డానికి ఫ్లోర్‌లు కూడా ఇక్క‌డే నిర్మిస్తున్నార‌ట‌. అంతే కాకుండా మిగ‌తా సినిమాల షూటింగ్‌ల‌కు, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌కు అనువుగా `అల్లు స్టూయోస్‌` వుండేలా ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version