సీఎం పర్యటన పై ఎవరైనా వాయిదా తీర్మానం ఇస్తారా? అని టీడీపీ పార్టీపై ఏపీ ఆర్థిక మంత్రి వర్యులు బుగ్గన రాజేంద్ర నాథ్ ఫైర్ అయ్యారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కాసేపటి క్రితమే ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే.. అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానంపై పట్టు పట్టింది. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనల వివరాలు సభ ముందు ఉంచాలంటూ టీడీపీ ఎమ్మెల్యేల వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చింది.
దీనిపై మంత్రి బుగ్గన స్పందించారు. సీఎం పర్యటన పై ఎవరైనా వాయిదా తీర్మానం ఇస్తారా?? వాయిదా తీర్మానం అంటే టీడీపీ సభ్యులకు అర్థం తెలుసా?? అని చురకలు అంటించారు. రాష్ట్రంలోనే కాదు దేశ చరిత్రలోనే ఎవరూ ఒక ముఖ్యమంత్రి పర్యటన గురించి ఇలా వాయిదా తీర్మానం ఇచ్చి ఉండరన్నారు. రేపు బ్రేక్ ఫాస్ట్ లో ఏం తిన్నారో కూడా వాయిదా తీర్మానం ఇస్తారేమో అంటూ ఫైర్ అయ్యారు ఏపీ ఆర్థిక మంత్రి వర్యులు బుగ్గన రాజేంద్ర నాథ్.