కేటీఆర్ వర్సెస్ బండి-రేవంత్..ఎవరూ తగ్గట్లేదు!

-

తెలంగాణ రాజకీయాల్లో సమవుజ్జిల సమరం జరుగుతుంది. మూడు ప్రధాన పార్టీల్లో ఉన్న ముగ్గురు ఫైర్ బ్రాండ్ నాయకుల మధ్య వార్ నడుస్తోంది. అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కే‌టి‌ఆర్, బి‌జే‌పి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. అయితే ఎవరైనా అధికార పార్టీనే టార్గెట్ చేస్తారు కాబట్టి..బండి, రేవంత్..అధికారంలో ఉన్న కే‌టి‌ఆర్‌నే టార్గెట్ చేసి ముందుకెళుతున్నారు.

ఇటు కే‌టి‌ఆర్ సైతం ఇద్దరు నేతలకు కౌంటర్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా తెలంగాణలో చోటు చేసుకున్న రెండు ఘటనలపై అధికార బి‌ఆర్‌ఎస్ పై విమర్శలు వస్తున్నాయి. ఒకటి టి‌ఎస్‌పి‌ఎస్‌సి పేపర్ లీకేజ్ ఘటన..మరొకటి స్వప్నలోక్ అగ్నిప్రమాదం ఘటన. ఈ రెండు ఘటనలపై ప్రతిపక్షాలు..బి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం టార్గెట్ గా విమర్శలు చేస్తున్నాయి. ఇక పేపర్ లీకేజ్ ఘటనపై బండి సంజయ్ ఆందోళనలకు దిగుతున్నారు. తాజాగా గన్ పార్క్ వద్ద మెరుపు ధర్నాకు దిగారు. అలాగే పేపర్ లీకేజ్ విషయంలో అధికార పార్టీ నేతలు ఉన్నారని, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కే‌టి‌ఆర్ రాజీనామా చేయాలని ఫైర్ అవుతున్నారు.

అయితే అదే స్థాయిలో కే‌టి‌ఆర్ కూడా కౌంటర్లు ఇస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థల పనితీరు, వాటి పరిధులపై కనీస అవగాహన కూడా లేకుండా బండి సంజయ్ పార్లమెంట్ సభ్యుడు ఎలా అయ్యాడో అని కేటీఆర్ విమర్శించారు. టి‌ఎస్‌పి‌ఎస్‌సి అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థ అని… అందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం చాలా తక్కువగా ఉంటుందని, ఈ విషయం కూడా తెలియకుండానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న బండి సంజయ్ మహా అజ్ఞాని అని, బండి సంజయ్ తెలివి లేని దద్దమ్మ అనే విషయం మరోసారి రుజువయిందని ఫైర్ అయ్యారు.

అటు రేవంత్-కే‌టి‌ఆర్ ల మధ్య కూడా మాటల యుద్ధం నడుస్తోంది. కే‌సి‌ఆర్ పోరాటం వల్లే తెలంగాణ వచ్చింది..రేవంత్, బండి అధ్యక్షులు అయ్యారని అంటున్నారు. అసలు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది కాబట్టే..కే‌సి‌ఆర్ సి‌ఎం, కే‌టి‌ఆర్, హరీష్ మంత్రులు, కవిత ఎమ్మెల్సీ అయిందని రేవంత్ కౌంటర్లు ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version