దేశంలో అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు ఒక్క బంపర్ ఆఫర్ అందించింది. పండుగ సీజన్ సమయంలో తమ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ తీసుకువచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రత్యేక ఆఫర్ కింద బ్యాంకు కస్టమర్లకు గోల్డ్ లోన్, పర్సనల్ లోన్, కార్ లోన్ వంటి రుణాలను అతి తక్కువ వడ్డీకే అందించనుంది. అంతేకాకుండా ఈ రుణాలన్నింటిపై ప్రాసెసింగ్ ఫీజును కూడా తగ్గించేసింది. మీరు ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా లోన్ కోసం అప్లై చేసుకుంటే ఎలాంటి ప్రాసెసింగ్ చెల్లించాల్సిన పని లేదని ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాలను వెల్లడించింది.
ఇకపొతే మీరు త్వరలో లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరిపోయే సువర్ణావకాశం కల్పిస్తుంది. రుణాలపై ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా మాఫీ చేసారు. ఇదే కాకుండా యోనో యాప్ కస్టమర్లకు కూడా సూత్రప్రాయ ఆమోదం అందించనుంది. ఇంకెందుకు ఆలస్యం కస్టమర్స్ ఈ బంపర్ ఆఫర్ ని తొందరగా సద్వినియోగం చేసుకోండి. గోల్డ్ లోన్ తీసుకోవాలని భావిస్తే వడ్డీ రేటు 7.5 శాతం నుంచి ప్రారంభం అవుతాయి. మీరు తీసుకున్న రుణాన్ని 36 నెలలలోగా తిరిగి చెల్లించాల్సి వస్తుంది. ఇదే కాకుండా పర్సనల్ లోన్‌పై కూడా చాలా తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయి. వడ్డీ రేట్లు కేవలం 9.6 శాతం నుంచి ప్రారంభమౌతున్నాయి. కారు లోన్ తీసుకుంటే వడ్డీ రేటు 7.5 శాతం నుండి ప్రారంభం అవుతాయి .
పర్సనలో లోన్ తీసుకునే కస్టమర్లకు మాత్రం సూత్రప్రాయ ఆమోదం కల్పిస్తోంది ఎస్‌బీఐ. ఇది కేవలం యోనో యాప్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. అయితే ఈ ఆఫర్ ఎస్‌బీఐ ఎంపిక చేసిన కస్టమర్లకే వర్తిస్తుంది. PAPL అని టైప్ చేసి అకౌంట్ నెంబర్ చివరి నాలుగు అంకెలు ఎంటర్ చేసి, 567676 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపిస్తే మీ రుణ అర్హత తెలుసుకోవచ్చు అని ఎస్‌బీఐ తెలిపింది.
Happiness is just around the corner. This festive season, get Gold, Car and Personal Loans and enjoy instant in-principle approval and zero processing fee via YONO. Apply now! https://t.co/MLCiou56dM#KhushiyonKaSwagat #GoldLoan #CarLoan #PersonalLoan #SBI #StateBankOfIndia pic.twitter.com/3kIdzj0FjA
— State Bank of India (@TheOfficialSBI) October 17, 2020