వియత్నంపై ప్రకృతి తన ప్రతాపాన్ని చూపిస్తుంది..ప్రకృతి ప్రకోపానికి మధ్య వియత్నం అతలాకుతం అవుతుంది..గత రెండు వారాలుగా వియత్నంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి..భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 90 మందికిపైగా మృతిచెందారు..మరో 34 మంది గల్లంతు అయినట్లు అధికారులు తెలిపారు..
కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా క్వాంగ్ ట్రై, తువా థియన్ హ్యూ, క్వాంగ్ నామ్ ప్రావిన్స్‌లలో అధిక ప్రాణనష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు..భారీ వర్షాలకు పలు జాతీయరహదారులు, స్థానిక రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ముందుజాగ్రత్తగా పాఠశాలలను ముసేశారు. సెంట్రల్ వియత్నంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వరకు భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.