తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్లకు బిగ్ షాక్ తగిలింది. ప్రయాణికుల భద్రత నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ సంస్థ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. బస్సు డ్రైవర్లు డ్రైవింగ్ చేసే సమయంలో ఇక పైన సెల్ఫోన్లు వాడకుండా ఆదేశాలు జారీ చేసింది.

ఈ నిషేధం సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అంటే నేటి నుంచి 11 డిపోలలో అమలు చేయబోతున్నారు. డ్రైవర్లు విధులకు హాజరైన వెంటనే తమ ఫోన్ లను ప్రత్యేక లాకర్లలో భద్రపరుచుకోవాలని ఆదేశాలు జారీ చేసింది ఆర్టీసీ సంస్థ. అత్యవసర సమాచారాన్ని కండక్టర్ ద్వారా చేరవేయవచ్చు అంటూ స్పష్టం చేసింది. దీని ఫలితాలను బట్టి భవిష్యత్తులో అన్ని డిపోలలో ఆర్టీసీ అమలు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఆర్టీసీ.