ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఉన్న దివ్యాంగులకు ఊరట కల్పిస్తూ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఏపీలో ఉన్న దివ్యాంగులందరికీ పెన్షన్ పంపిణీ చేస్తామని ప్రకటన చేసింది. నోటీసులతో సంబంధం లేకుండా సెప్టెంబర్ మాసంలో దివ్యాంగులందరికీ పింఛన్ పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.

నోటీసులు అందుకున్న 1.35 లక్షల మందితో పాటు 95 శాతం మంది ఆ ఫీల్ చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. అనర్హులపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోబోతున్నట్లు వివరించారు. కొత్తగా 7872 మందికి నాలుగు వేల రూపాయలు చొప్పున స్పాస్ మంజూరు చేసినట్లు కొండపల్లి శ్రీనివాస్ వివరించారు. ఈ పెన్షన్ల పంపిణీ కోసం 3.15 కోట్లు రిలీజ్ చేసినట్లు స్పష్టం చేశారు.