చాలా మంది మంచిగా వ్యాపారాన్ని చేయడానికి చూస్తారు నిజానికి వ్యాపారాల ద్వారా మనం ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఉద్యోగాలని కూడా కాదనుకొని చాలా మంది వ్యాపారాలపై దృష్టి పెడుతున్నారు. అయితే మీరు కూడా ఏదైనా బిజినెస్ ని మొదలు పెట్టాలనుకుంటే పోస్ట్ ఆఫీస్ ఫ్రెంఛైజీ తీసుకోవచ్చు.
పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ తీసుకోవడం వలన మీ సొంతూరులో మంచిగా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. తక్కువ పెట్టుబడి తోనే ఎక్కువ రాబడిని పొందడానికి అవుతుంది అది కూడా మీరు ఉండే చోటే. ఇలా ఈజీగా మీరు ఈ బిజినెస్ ని మొదలు పెట్టొచ్చు. ఇక పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ ద్వారా మీరు ఎలాంటి సేవలు అందించాలి ఎలా ఫ్రాంచైజీ తీసుకోవాలి అనే వివరాలని ఇప్పుడు చూద్దాం.
సేవల విషయానికి వస్తే.. ఫ్రాంఛైజీలో కేవలం స్టాంప్స్, ఇతర స్టేషనరీ వస్తువులను అమ్మడానికి అవుతుంది. అలానే రిజిస్టర్డ్ ఆర్టికల్స్, స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్, మనీ ఆర్డర్ సర్వీస్లను బుక్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. బిల్లులు, టాక్స్, జరిమానాలు చెల్లింపు సర్వీసులు ఇవ్వాల్సి వుంది. పోస్టల్ లైఫ్ ఇన్సురెన్స్ ఏజెంట్గా కూడా సేవలని ఇవ్వాలి.
ఫ్రాంచైజీ తీసుకోవడానికి ఎవరు అర్హులు..?
ఆయా వ్యక్తికి 18 ఏళ్లు నిండి ఉండాలి. అలానే అగ్రీమెంట్ మీద సంతకం చేసి దీన్ని పొందాల్సి వుంది. కనీసం 8వ తరగతి అయినా ప్యాస్ అయినవాళ్లే అర్హులు. మీకు సుమారుగా లక్ష నుంచి 1.50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. రూ.5000 నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ కింద పే చెయ్యాలి కూడా. మీరు అప్లికేషన్ ని సబ్మిట్ చేసి ఫ్రాంచైజీ పొందొచ్చు. ప్రాసెస్ పూర్తి అయ్యాక డివిజనల్ హెడ్ 14 రోజుల్లో అర్హులు కాదా అనే నిర్ణయం తీసుకుంటారు.
డబ్బులు ఎలా వస్తాయి..?
రిజిస్టర్ పోస్ట్, స్పీడ్ పోస్ట్, మనీ ఆర్డర్ కి మీకు రెండు రూపాయిలు వస్తాయి. ఎక్కువ సేవలని అందిస్తే అదనంగా 20 శాతం కమిషన్ ఉంటుంది.