ఆ కారణంతోనే దాసరిగారితో చనిపోయేంతవరకు సినిమాలు చేయలేదు.. సీనియర్ యాక్టర్ నరసింహ రాజు..

-

Entertainment జానపద చిత్రాలు కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు సీనియర్ యాక్టర్ నరసింహారాజు.. పలు సినిమాల్లో సహాయ నటుడిగా తనదైన ముద్ర వేసిన ఈయన.. ఆంధ్ర కమలహాసన్ గా కూడా పేరు తెచ్చుకున్నారు.. దాదాపు 110 చిత్రాల్లో నటించిన ఈయన.. 70ల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించినా 1978లో వచ్చిన జగన్మోహిని చిత్రంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు విఠలాచార్య దర్శకత్వం వహించారు.. ఈ సినిమా విజయంతో మరిన్ని అవకాశాలు అందుపుచ్చుకున్న నరసింహారాజు.. కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అయితే గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈయన తాజాగా రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన అనుకోని ప్రయాణం చిత్రంలో నటించారు.. అయితే ఈయన తాజాగా టాలీవుడ్ హీరోయిన్ ప్రేమతో కలిసి ఆలీతో జాలీగా కార్యక్రమానికి హాజరయ్యారు… ఈ సంద్భంగా దర్శకుడు దాసరి నారాయణరావుతో తనకున్న బంధం కోసం చెప్పుకొచ్చారు..

51 ఏళ్లుగా సినీ రంగంతో తనకు అనుబంధం ఉందని.. 1974 లో విడుదలైన నీడలేని ఆడది సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేశానని అన్నారు.. దాసరి నారాయణ రావు గారితో తనకు మంచి అనుబంధం ఉండేదని నేను ఎప్పుడు వెళ్లి అడిగినా ఆయన నాకు అవకాశం ఇస్తారని నమ్మకం ఉండేదని అన్నారు అయితే 1993 వరకు తనకు సినీ అవకాశాలు బాగానే వచ్చాయని ఆ తర్వాత మాత్రం అవకాశాలు రావడం తగ్గిపోయాయని చెప్పారు ఈ సమయంలో దాసరి గారి దగ్గరికి వెళితే ఆయన తనకు మళ్ళీ తన సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చారని చెప్పారు.. అయితే మళ్లీ కొన్నాళ్ల తర్వాత ఆయన ఓ సినిమాలో నటించడానికి తనని సంప్రదించినప్పుడు తన ఆరోగ్యం సరిగా లేక అవకాశాన్ని వదులుకున్నానని చెప్పుకొచ్చారు.. అయితే తాను సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదని.. బుద్ధిగా చదువుకునే వాడినని.. చివరి పరీక్షల్లో సరిగ్గా చదవకపోవడంతో మార్కులు తక్కువగా వస్తే ఇంట్లో కోప్పడతారనే భయంతో తణుకు నుంచి మద్రాసు వెళ్లే ట్రైన్ ఎక్కానని చెప్పుకొచ్చారు.. సినీ రంగంలోకి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డానని.. చివరికి ఎలాగోలా నిలదొక్కుకున్నానని అన్నారు. ప్రస్తుతం హైదరాబాదులోనే ఉంటున్నట్లు.. కొడుకు కెనడాలో స్థిరపడినట్లు తెలిపారు. ఎవరు డబ్బులు అడిగినా లేదనకుండా ఇచ్చే గుణం అతని తండ్రి నుంచి తనకు వచ్చిందని, దీనివల్లనే చాలా వరకు పోగొట్టుకున్నానని.. అయితే ప్రస్తుతం బతకడానికి ఎలాంటి ఇబ్బంది లేదంటూ చెప్పుకొచ్చారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version