మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా…? అయితే మీకోసం ఇక్కడ కొన్ని ఐడియాస్ ఉన్నాయి. మీరు ఏ ఊర్లో వున్నా సరే ఈ వ్యాపారాలు బాగా రన్ అవుతాయి. పైగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందొచ్చు. అయితే మరి ఆ బిజినెస్ ఐడియాస్ గురించి ఒక లుక్ వేసేయండి.
చాలా మంది ఏ బిజినెస్ మొదలుపెట్టాలి అని తెగ ఆలోచిస్తూ ఉంటారు. మీరు కూడా ఇలా ఆలోచిస్తూ ఉంటే ఈ ఐడియాస్ మీకు బాగా పనికి వస్తాయి. ఇక వాటి కోసం చూస్తే…
డైరీ సప్లై :
ఏ ఊర్లో అయినా సరే డైరీ సప్లై బాగా రన్ అవుతుంది. పైగా ఎక్కువ లోన్ ఫెసిలిటీస్ కూడా ఉంటుంది. తక్కువ పెట్టుబడి తో మంచి రాబడి ఇచ్చే బిజినెస్ ఇది.
రిటైల్ స్టోర్:
ఏదైనా రిటైల్ స్టోర్ మొదలుపెట్టి మీరు మంచిగా సంపాదించొచ్చు. స్వీట్ కొట్టు మొదలు జనరల్ షాప్ వరకు మీరు ఉండే ఊర్లలో పెట్టొచ్చు. ఇది కూడా మంచి రాబడిని ఇస్తుంది.
పౌల్ట్రీ ఫార్మ్:
తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో పౌల్ట్రీ ఫార్మ్ మొదలుపెట్టి ఎక్కువ రాబడిని పొందొచ్చు. చాలా మంది ఈ బిజినెస్ ని ఫాలో అవుతున్నారు. కాబట్టి మీ ఊర్లో ఈ బిజినెస్ తక్కువ మంది చేస్తుంటే మీరు మొదలుపెట్టి బాగా సంపాదించచ్చు.
ఆయిల్ మిల్:
ఊర్లో ఆయిల్ మిల్ ఉండడం చాలా అవసరం. సోయాబీన్ నూనె, వేరుశనగ నూనె, ఆవాలు నూనె మొదలైనవి అవసరం కనుక ఈ బిజినెస్ కూడా మొదలు పెట్టొచ్చు. పైగా దీనికి డిమాండ్ కూడా ఎక్కువే.
ఇంటర్నెట్ కేఫ్:
ఈ మధ్య కాలంలో చాలా మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. మీరు ఇంటర్నెట్ కేఫ్ ని స్టార్ట్ చేసి చార్జీలు వసూలు చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ తక్కువవుతుంది పైగా ఆదాయం ఎక్కువ వస్తుంది.
బనానా చిప్స్:
మీరు బనానా చిప్స్ ని తయారు చేసి మంచి రాబడిని పొందొచ్చు మీరు మీ దగ్గరలో ఉన్న షాపులు వంటి వాటికి సప్లై చేసి మీరు మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. ఇలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ రాబడిని పొందొచ్చు.