చాల మంది మంచి వ్యాపారం చెయ్యాలని అనుకుంటారు. అయితే ఏ వ్యాపారం చెయ్యాలో తెలియక ఆలోచించే వాళ్ళ కోసం ఈ బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ వల్ల మంచి రాబడి వస్తుంది. పైగా పెట్టుబడి కూడా తక్కువే. అదే కుందేళ్ల పెంపకం. మరి ఈ బిజినెస్ కి సంబంధించి పూర్తి వివరాలని మనం ఇప్పుడే చూసేద్దాం. ఇక పూర్తి వివరాల లోకి వెళితే..
కుందేళ్ల పెంపకం కోసం మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టక్కర్లేదు. పైగా దీని ద్వారా మంచి రాబడి వస్తుంది. మీరు రూ.4 లక్షల ఇన్వెస్ట్‌మెంట్ తో ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. కుందేలు మాంసంతో పాటు కుందేలు జుట్టు తో ఉన్ని కూడా తయారు చేస్తారు. కాబట్టి మంచి డిమాండ్ వుంది. దీని కోసం ముందు మీరు యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలి.
ఒక్కో యూనిట్‌లో 7 ఆడ కుందేళ్లు, 3 మగ కుందేళ్లను ఉంచాలి. ఒక పది యూనిట్లకు నాలుగు లక్షలు అవుతుంది. షెడ్, ఫుడ్, బోను, కుందేళ్లు అన్ని కలిపి నాలుగు లక్షలు. ఆడ కుందేళ్లు 6 నెలల తర్వాత బ్రీడింగ్‌కు వస్తాయి. కుందేళ్ల ప్రెగ్నెన్సీ పీరియడ్ 30 రోజులు. ఒకేసారి 6 నుంచి 7 పిల్లలు పుట్టొచ్చు. పైగా ఈ పిల్లలు కూడా నెల రోజుల్లో పెరిగిపోతాయి.
ఒక్కో ఆడ కుందేలు నుంచి 5 పిల్లలు పుట్టిన కూడా రెండు నెలల్లో 350 కుందేళ్లు ఉంటాయి. మీరు ఏడాదిలో రూ.10 లక్షల విలువైన కుందేళ్లను విక్రయిస్తే ఇందులో రూ.2-3 లక్షల వరకు ఖర్చు తీసేస్తే మీకు రూ.7 లక్షలు మిగులుతుంది. పెట్టుబడి రూ.4 లక్షల ఇన్వెస్ట్‌మెంట్ తీసేస్తే రూ.3 లక్షల లాభం మీకు వస్తుంది.