బిజినెస్ ఐడియా: గాడిదల పాలతో వ్యాపారం..కోట్లు సంపాదిస్తున్న వ్యక్తి..

-

ఆవు పాలు కడవడు తాగినా ఒకటే..గాడిద పాలు చెంచా తాగిన ఒకటే అంటున్నారు. ఎందుకంటే ఆ పాలల్లో అన్నీ పోషకాలు ఉన్నాయి.దీన్ని ఓ వ్యక్తి క్యాష్ చేసుకున్నాడు..గాడిద పాలను అమ్ముతూ కోట్లు సంపాస్తున్నాడు..ఇది నిజంగా గర్వించదగ్గ విషయం అనే చెప్పాలి.అంతేకాదు కొంత మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాడు. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా వానార్‌పేటకు చెందిన యు.బాబు 11వ తరగతి వరకు చదువుకున్నాడు. చదువుపై ఆసక్తి లేక ఆ తర్వాత మానేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లు వ్యవసాయం చేశాడు. లాభసాటిగా లేకపోవడంతో గాడిదలు పెంచాలని నిర్ణయించుకున్నాడు..

ఈ విషయం అందరికి చెబితే నవ్వారు..కానీ దాన్ని పట్టించుకోకుండా అతను మెల్లగా ఆ వ్యాపారాన్ని మొదలు పెట్టాడు.బెంగళూరుకు చెందిన ఓ కాస్మొటిక్ కంపెనీ 28 రకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ని తయారుచేస్తోంది. వాటి తయారీలో గాడిద పాలదే కీలక పాత్ర. నెలకు 1000 లీటర్ల పాలు అవసరమవుతాయి. కానీ అంత భారీ మొత్తంలో సరఫరా చేసే వారు చుట్టుపక్కల ఎక్కడా లేరు. తమిళనాడు మొత్తం మీద 2 వేల గాడిదలే ఉన్నాయి. ఒక్కో ఆడ గాడిద ఆరు నెలల పాటు రోజుకు 350 ఎం.ఎల్. చొప్పున మాత్రమే పాలిస్తాయి. అందుకే కాస్మొటిక్ కంపెనీలకు సరిపడా గాడిద పాలు ఉత్పత్తి కావడం లేదు. ఈ డిమాండ్‌ను సరిగ్గా క్యాష్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు బాబు. కానీ ఆ ఐడియాను కుటుంబ సభ్యులకు చెబితే ఎవరూ వినలేదు.

ఈ క్రమంలోనే వారిన విరుదాచలంలో గాడిదలు అమ్మే వారి వద్దకు తీసుకెళ్లాడు. వారు 10 మి.లీ. పాలను రూ.50 ఎలా అమ్ముతున్నారో వివరించారు..అలా తన బిజినెస్ ను మొదలు పెట్టాడు..బెంగళూరులోని కాస్మొటిక్ కంపెనీతో బాబు ఒప్పందం కుదర్చున్నాడు. లీటర్‌కు 7వేల చొప్పున పాలను విక్రయిస్తున్నాడు. యూరప్‌లో ఎక్కువ డిమాండ్ ఉందని.. అక్కడకు ఎగుమతి చేస్తే.. మరింత ఎక్కువ లాభాలు వస్తాయని బాబు చెబుతున్నాడు. ఈ క్రమంలోనే యూరప్ కంపెనీలతో ఒప్పందం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. మరి గాడిద పాలకు ఎందుకు ఇంత రేటు ఉందో తెలుసా..? శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు… వృద్ధాప్య ఛాయలను తగ్గించే సామర్థ్యం వీటికి ఉంది. అందుకే వీటిని పలు రకాల ఔషధాలతో పాటు సబ్బులు, క్రీములు వంటి బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీలో వినియోగిస్తున్నారు. గాడిద హ్-య్ తయారుచేసిన కాస్మొటిక్ ఉత్పత్తుల ధర కూడా ఎక్కువగానే ఉంటుంది..మొత్తానికి కోట్లు సంపాదించి అందరికి ఆదర్షంగా నిలిచాడు..ఇలాంటి బిజినెస్ చేయాలనీ ఉంటే మీరు కూడా చెయ్యండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version