డీఆర్‌డీఓ నివేదిక.. ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రమాదాలకు కారణాలివే!!

-

ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రమాదాల బారిన పడుతున్నాయి. బ్యాటరీ ప్యాక్‌లు, మాడ్యూల్స్ డిజైన్‌లతో సహా బ్యాటరీల్లోని లోపాలే కారణమని, అందుకే ఛార్జింగ్ పెట్టే సమయంలో వాహనాల్లో మంటలు చెలరేగుతున్నాయని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) తాజాగా వెల్లడించింది. కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ దేశంలో జరిగిన అనేక ఈ-స్కూటర్ల అగ్ని ప్రమాదాలకు గల కారణాలపై పరిశోధన జరిపించింది. దీంతో ఫైర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం అయిన ఫైర్, ఎక్స్‌ ప్లోజివ్, ఎన్విరాన్‌మెంట్ సేఫ్టీని నియమించింది. అలాగే దేశంలోని ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు కఠినమైన నిబంధనలు తీసుకురావాలని ఆదేశించింది.

ఎలక్ట్రిక్ వాహనం

ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు చెలరేగడానికి ముఖ్యంగా బ్యాటరీ సెల్‌ నాణ్యత తక్కువగా ఉండటమే కారణమని పేర్కొంది. అలాగే ఉష్ణోగ్రతలను తట్టుకునేలా బ్యాటరీలు తయారు చేయకపోవడం జరుగుతోందన్నారు. ఖర్చులను తగ్గించుకునేందుకు ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలు డీ-గ్రేడ్ మెటీరియల్‌ను ఉపయోగిస్తోందని వెల్లడించారు. భారతీయ ఉష్ణోగ్రత, ఛార్జింగ్ పెట్టినప్పుటి పరిస్థితిని సరైన ప్రక్రియ ద్వారా పరీక్షించాలని అల్టిగ్రీన్ ప్రొపల్షన్ ల్యాబ్ వ్యవస్థాపకుడు, సీఈఓ అమితాబ్ శరణ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version