“ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి ” అంటున్న వివిఫై ఇండియా ఫైనాన్స్..!

-

పండుగ నేపథ్యంలో వివిఫై ఇండియా ఫైనాన్స్ కొత్త సర్వీసులు తీసుకొచ్చింది. యూపీఐ యూజర్ల కోసం వివిఫై ఇండియా కొత్త పేమెంట్ ఆప్షన్ తీసుకువచ్చింది. మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు లేకపోయినా ఇకమీదట మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సులభంగా లోన్ పొందే అవకాశం అందుబాటులో ఉంది. యూపీఐ యూజర్ల కోసం వివిఫై ఇండియా కొత్త పేమెంట్ ఆప్షన్ తీసుకొచ్చింది. ” ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి ” అనే సర్వీసులకు ఇటీవల కాలంలో ఎంతో ఆదరణ పెరుగుతోంది. బ్యాంకులు మాత్రమే కాకుండా ఫిన్‌టెక్ కంపెనీలు కూడా కస్టమర్లకు ఇటువంటి సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. హైదరాబాద్‌ కు చెందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ వివిఫై ఇండియా ఫైనాన్స్ కూడా ప్రస్తుతం ఇలాంటి సర్వీసులనే ప్రారంభించింది. దీనివల్ల యూపీఐ యూజర్లకు మరింత ప్రయోజనం లభించనుంది.

money

వివిఫై ఇండియా ఫైనాన్స్ తాజాగా ఫ్లెక్స్ ‌పే‌ తో జత కట్టి కొత్త పేమెంట్ ఆప్షన్ తీసుకువచ్చింది. సులభంగా లోన్ పొందే అవకాశం అందుబాటు లోకి తీసుకువచ్చింది. వివిఫై ఇండియా కొత్త పేమెంట్ ఆప్షన్ తీసుకువచ్చింది. ఇందులో భాగంగా స్కాన్ నౌ అండ్ పే లేటర్ సదుపాయన్ని కస్టమర్లకు అందిస్తోంది. బ్యాంక్ అకౌంట్ లేదా డిజిటల్ వాలెట్స్‌లో డబ్బులు లేకపోతే ఈ ఫీచర్ ద్వారా డబ్బులు చెల్లించొచ్చు. ఫ్లెక్స్ ‌పే‌ తో యూపీఐ ద్వారా ఎప్పుడైనా ఎవరికైనా లావాదేవీలు నిర్వహించొచ్చు.యూపీఐ యూజర్లకు ఇది అందుబాటులో ఉంటుంది. ఆన్ ‌లైన్ ‌లోనే లోన్ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. ఎలాంటి తనఖా లేకుండానే రుణం పొందొచ్చు. వడ్డీ రేట్లు కూడా ఆమోదం లభిస్తుంది. ఒక్కసారి ఆమోదం లభిస్తే.. ఆ డబ్బులను ఎన్ని రోజులైనా ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు.

దీనికి భారతీయ పౌరులు అయ్యి ఉండాలి. 21 ఏళ్లకు పైన వయసు తప్పనిసరి. అలాగే వేతనం కనీసం రూ.8,000 వచ్చిన చాలు. తీసుకున్న రుణాన్ని 3 ఏళ్లలోపు తిరిగి చెల్లించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ప్లెక్స్ ‌పే యాప్ డౌన్ ‌లోడ్ చేసుకొని, అకౌంట్ క్రియేట్ చేసుకొని లోన్ కోసం అప్లై చేసుకొని, లోన్ అప్రూవల్ వచ్చిన వెంటనే డబ్బులను హ్యాపీగా ఉపయోగించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version