కర్ణాటకలో కాంగ్రెస్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు… పాత పరిచయాలతో తలబొప్పి కట్టిస్తున్నారు…!

-

కర్ణాటక ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నానా కష్టాలు పడుతుంది. వివరాల్లోకి వెళితే కర్ణాటకలో జేడీఎస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన ఎమ్మెల్యేల మీద అప్పటి స్పీకర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. దీనితో 15 స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించడానికి బిజెపి, కాంగ్రెస్, జేడీఎస్ తీవ్రంగానే శ్రమిస్తున్నాయి. ప్రధానంగా జేడీఎస్ కాంగ్రెస్ పార్టీలో బీజేపీ ని నిలువరించడానికి పలు వ్యూహాలు రచిస్తూ ప్రచారం చేస్తున్నారు.

ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను గెలిపించేందుకు తీవ్రంగానే శ్రమిస్తోంది, కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేతలు అయినా దినేష్ గుండూరావు, పరమేశ్వరన్, డీకే శివకుమార్, సిద్దరామయ్యలు ప్రచారంలో దూకుడు పెంచుతున్నారు. ఎక్కడా కూడా బీజేపీ కి అవకాశం ఇవ్వకుండా ప్రచారం చేస్తున్నారు నేతలు. ఈ ఉప ఎన్నికలు ప్రభుత్వ ఏర్పాటుని ప్రభావితం చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా కష్టపడుతున్నారు. ఇక్కడే కాంగ్రెస్ కి కష్టం వచ్చిపడింది. కాంగ్రెస్ నుంచి బిజెపికి వెళ్లిన అనర్హత ఎమ్మెల్యేలకు బీజేపీ అధిష్టానం సీట్లు ఇచ్చింది. 13 మందికి సీట్లు ఇవ్వడంతో తమకు ఉన్న పాత పరిచయాలతో కాంగ్రెస్ క్యాడర్ ని తమ వైపుకి తిప్పుకునే ప్రయత్నాలు చేస్తుంది.

ఆ పరిచయాలతో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని పక్కదోవ పట్టించే విధంగా కుస్తీ పడుతున్నారు బీజేపీ అభ్యర్థులు. ప్రధానంగా స్థానిక నేతలకు బీజేపీ అభ్యర్థులు గాలం వేశారని తెలియడంతో వారితో నేరుగా కాంగ్రెస్ సీనియర్లు మాట్లాడుతూ పార్టీ కోసం పని చెయ్యాలని కోరుతున్నారు. ఇక కొంత మంది కాంగ్రెస్ నేతలు ప్రచారంలో బీజేపీ కి సహకరిస్తున్నారని తెలియడంతో వారిని కూడా పక్కన పెడుతున్నారు. మోసం చేసిన వాళ్ళను ఎలాగైనా సరే ఓడించాలి అనే కసితో కాంగ్రెస్ పార్టీ దూకుడు గా వెళ్తుంది. అసంతృప్తిగా ఉన్న స్థానిక నేతలు కొందరికి బీజేపీ డబ్బులు ఇచ్చిందనే సమాచారంతో దినేష్ గుండూ రావు వారితో సమావేశమై… తమ వైపుకి తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారట. ఏది ఎలా సరే ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రచారానికి బీజేపీ అడ్డంకులు అన్నీ ఇన్ని కావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version