కొత్త జిల్లాల ఏర్పాటుపై మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. రాయలసీమ లోని నాలుగు జిల్లాలు చాలా పెద్దవి అని.. రాయలసీమను 14 జిల్లాలుగా చేయాలని బైరెడ్డి డిమాండ్ చేశారు. దేశంలో ని 13 రాష్ట్రాల వైశాల్యం కంటే రాయలసీమ వైశాల్యం పెద్దది.. అనంతపురం, కర్నూల్ జిల్లాలో ఒక్కొక్కటి నాలుగు జిల్లాలుగా చేయాలన్నారు.
కడప, చిత్తూరు జిల్లాలో మూడు జిల్లాలుగా చేయాలని డిమాండ్ చేశారు. అధోనిని జిల్లా చేయాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాము… మదనపల్లె జిల్లాగా చేయాలన్నారు. ప్రజల వద్దకే పాలన ఉండాలని నాటి సీఎం ఎన్టీఆర్ పరిపాలన సాగించారని.. ఎంఆర్వో అని ఎన్టీఆర్ పెడితే..వైఎస్సార్ వచ్చి తహసీల్దార్ అని పేరు మార్చారని అగ్రహించారు. ఎన్టీఆర్ ప్రజల వద్దకు పాలన తెస్తే.. జగన్ ప్రజలకు దూరంగా పాలన సాగిస్తున్నాడని ఫైర్ అయ్యారు. జగన్ తుగ్లకా జగ్లకా అర్థం కావడం లేదు.. కర్నూల్ జిల్లాలో ఆదోని, డోన్ జిల్లాలుగా చేయాలని డిమాండ్ చేశారు.