టీడీపీ పార్టీలోకి వెళ్లడంపై బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి క్లారిటీ

-

గత రెండు రోజులు గా ఏపీ ఓ ప్రచారం జోరుగా సాగుతోంది. శాప్‌ చైర్మన్‌, వైసీపీ కీలక నేత, జగన్‌ ఆత్మీయుడు.. బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి.. టీడీపీ పార్టీ కండువా కప్పుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ వార్తలపై స్వయంగా… బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి స్పందించారు.

తాను వైఎస్సార్‌సీపీ పార్టీకి వీర సైనికుడినని… నాకు వైఎస్‌ జగన్‌ నందికొట్కూరు పార్టీ ఇన్‌చార్జి బాధ్యతలు, శాప్‌ చైర్మన్‌ పదవిని ఇచ్చారని బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి గుర్తు చేశారు. తనకు ఇంత చేసిన పార్టీని నేనెందుకు వీడుతాను? మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేయడం మానేయాలని ఫైర్‌ అయ్యారు.

నేను ఎప్పటికీ YSRCP, జగన్‌కు విధేయుడనే నని కుండ బద్దలు కొట్టి మరీ చెప్పారు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాది.. నేను ఎప్పటికీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విధేయుడినేనన్నారు. కొన్ని మీడియా సంస్థల్లో నేను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తమైనవన్నారు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version