సీఏఏ అమలు ఇప్పటికే ఆలస్యమైంది: సద్గురు

-

సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివాదస్పదమైన ‘పౌరసత్వ సవరణ చట్టం-2019’ ను అమల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.అయితే కేంద్రప్రభుత్వం తెచ్చిన సిటిజెన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇప్పటికే పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు నాయకులు ఈ చట్టము అమలుకి వ్యతిరేకంగా అభిప్రాయం వ్యక్తం చేయగా, మరికొందరు నాయకులు ఈ చట్టాన్ని సమర్థించారు.

పౌరసత్వ సవరణ చట్టం-2019 పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టం అమలు ఆలస్యమైందన్నారు. ‘విభజనప్పుడు పొరుగు దేశాల్లో స్థిరపడిన ప్రజలకు సమస్యలు ఎదురైతే మళ్లీ తిరిగి తీసుకొస్తామని నాటి నేతలు హామీ ఇచ్చారు అని గుర్తు చేశారు. 75ఏళ్లలో వారు ఎన్నో కష్టాలు అనుభవించారు. 30-40ఏళ్ల క్రితమే కొందరు ఇండియా వచ్చినా ఇంకా శరణార్థులుగానే ఉన్నారు. ఇందుకు సిగ్గుగా లేదా?’ అని ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version