కిడ్నీలో రాళ్లకు ఆలివ్‌ ఆయిల్‌, నిమ్మరసం కాంబినేషన్‌ వాడొచ్చా..?

-

మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.. ఇవి దెబ్బతిన్నాయంటే.. అనారోగ్యం పాలైనట్లే..వ్యర్థాలను క్లీన్‌ చేసి కిడ్నీలు ఒక్కసారి పాడైతే.. మళ్లీ సాధారణ స్థితికి రావడం చాలా కష్టం.. చాలామందిలో కామన్‌గా ఎదురయ్యే సమస్య కిడ్నీలో రాళ్లు ఏర్పడటం. వీటిని తొలగించుకోవడానికి శస్త్రచికిత్సలు చేయించుకుంటారు. దీని వల్ల సమస్య త్వరగా పరిష్కారం అవుతుందేమో కానీ.. చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న రాళ్లైతే.. ఆపరేషన్‌తో పని లేకుండా కొన్ని ఇంటి చిట్కాల ద్వారా కరిగించుకోవచ్చు.. వీటి గురించి మీకు ఇప్పటికే చాలా తెలిసి ఉంటుంది.. ఓ సారి.. ఈ చిట్కాలను కూడా ట్రై చేసి చూడండి.!

అసలు కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి..

కిడ్నీలో యూరిన్‌లో లిక్విడ్‌, సాలిడ్‌ కంపోనెంట్స్‌ రెండూ ఉంటాయి. సాలిడ్‌ కంపోనెంట్‌లో సోడియం, పొటాషియం, యూరిక్‌ యాసిడ్‌, కాల్షియంతో పాటు రకరకాల పదార్థాలుంటాయి. ఇవి యూరిన్‌లో కరగకుండా ఉంటే అవి చిన్న చిన్న రేణువులుగా మారతాయి. మంచినీళ్లు తాగకుండా ఉండే సరికి అవి ఇంకాస్త పెద్దగా మారి రాళ్లుగా తయారవుతాయి. సాధారణంగా ఆక్జలేట్‌ లేదా ఫాస్ఫరస్‌లతో క్యాల్షియం కలవటం వల్ల రాళ్లు ఎక్కువగా ఏర్పడతాయని నిపుణులు అంటున్నారు. నీరు సరిగ్గా తగాకపోయినా, అధిక బరువు, డయాబెటిస్‌ సమస్య ఉన్నవారికి, శారీరక శ్రమ లేకపోయినా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. శరీరంలో విటమిన్‌ బీ6, సీ లోపం, విటమిన్‌ డి అధికంగా ఉన్నా కూడా రాళ్లు ఏర్పడతాయి. మద్యం తాగే అలవాటు, కిడ్నీలకు ఇన్‌ఫెక్షన్లు వస్తున్నా, కణితులు ఉన్నపుడు కూడా రాళ్లు ఏర్పడతాయి.

ఇంటి చిట్కాలతో ఇలా తగ్గించుకోవచ్చు..

ఆలివ్‌ ఆయిల్, నిమ్మరసం కాంబినేషన్‌ కిడ్నీలో రాళ్లను కరిగించటంలో బాగా హెల్ప్‌ అవుతుంది. కిడ్నీలో స్టోన్స్‌ ఉన్నవారు ఈ రెండిటి కాంబినేషన్‌తో వాటర్‌ డైలీ తాగితే సరి. నిమ్మరసం రాళ్లను విచ్ఛిన్నం చేస్తే, ఆలివ్ ఆయిల్ రాళ్లను బయటకు వెళ్లేందుకు లూంబ్రికెంట్‌గా పని చేస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే టాక్సిన్స్ బయటకు వెళ్లి కిడ్నీలు శుభ్రంగా మారతాయి.

కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న వారు రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను రోజూ గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

దానిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి కిడ్నీలో రాళ్లను బయటకు పంపిస్తాయి.

ఈ చిన్న చిట్కాలను కిడ్నీలో రాళ్లు ఉన్నవారే కాదు.. కిడ్నీ ఆరోగ్యం కోసం.. మాములు వారు కూడా అప్పుడప్పుడు పాటించవచ్చు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version