ధనవంతులు అవ్వాలని ఉందా..? అయితే ఈ 4 ప్రభుత్వ స్కీమ్స్ తో సాధ్యం..!

-

చాలా మంది వాళ్లకి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతూ వుంటారు. ఈ స్కీమ్స్ లో డబ్బులని పెడితే అదిరే లాభాల్ని పొందొచ్చు. పైగా చాలా మంది ధనవంతులు అవ్వాలని అందుకోసం రకరకాల పద్ధతులని పాటిస్తూ వుంటారు. మీరు కూడా ధనవంతులు అవ్వాలని చూస్తున్నారా..? అయితే ఈ స్కీమ్స్ గురించి చూడాల్సిందే.

ఈ స్కీమ్స్ లో డబ్బులు పెడితే చక్కటి ఆదాయం వస్తుంది. పైగా రిస్క్ కూడా ఉండదు. మరిక ఈ స్కీమ్స్ కి సంబంధించి పూర్తి వివరాలని చూసేద్దాం.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్:

పన్ను ఆదా కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటే, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ సీనియర్ సిటిజన్లు కి బాగుంటుంది. ఇన్వెస్టర్లకు 8 శాతం రాబడి వస్తుంది. ధనవంతులు అవ్వాలని చూస్తుంటే ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టచ్చు. ఈ స్కీమ్ లో ప్రభుత్వం తన పెట్టుబడి పరిమితిని 15 లక్షల నుండి 30 లక్షలకు పెంచింది.

కిసాన్ వికాస్ పత్ర స్కీమ్:

ఈ స్కీమ్ కూడా ఎంతో బాగుంటుంది. పోస్టాఫీసు 7.2శాతం అధిక వడ్డీని ఈ స్కీమ్ కి ఇస్తోంది. ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ తో కూడా ఎక్కువ లాభం వస్తుంది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్:

ఈ స్కీమ్ తో కూడా చక్కటి లాభాలని పొందొచ్చు. ప్రజాదరణ పొందిన చిన్న మొత్తాల పొదుపు పథకం లో ఇది కూడా ఒకటి. 7.1శాతం రాబడిని పొందొచ్చు.

నేషనల్ సేవింగ్స్ స్కీమ్:

18 ఏళ్లు నిండిన భారతపౌరులు ఎవరైనా సరే ఈ స్కీమ్ కి అర్హులే. పదవీవిరమణ తర్వాత జీవితానికి భద్రత ఇచ్చేనందుకే ఈ స్కీమ్ ని తీసుకు రావడం జరిగింది. కనీసం రూ. 500 టైర్ లేదా టైర్ 2 ఖాతాను ఓపెన్ చెయ్యచ్చు. మీరు ఈ స్కీమ్ లో పెట్టుబడి పెడితే ద్రవ్యోల్బణం కంటే ఎక్కువ మొత్తాన్ని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version