ప్రస్తుతం బాలీవుడ్ లో పెళ్లిళ్ల సందడి జోరుగా కొనసాగుతోంది. కొత్త ఏడాది ప్రారంభంలోనే కేఎల్ రాహుల్ – అతియా శెట్టి , కియారా అద్వానీ- సిద్ధార్థ మల్హోత్రా పెళ్లిళ్లు చేసుకుని కొత్త బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరొక బాలీవుడ్ జంట పెళ్లి పీటలు ఎక్కబోతోంది. తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి..
స్విని నిమేష్ ఖరా.. టీవీ షో బా బహు ఔర్ బేబీ లో కొంటె చైతాలి పాత్రకు గుర్తింపు తెచ్చుకుంది. 2007లో వచ్చిన అమితాబ్ – టబు నటించిన చిత్రం చీనీ కమ్ లో నటించిన ఈమె పాత్రకు మంచి పేరు లభించింది. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా స్వినీ ఖరా నటించింది. ఈ చిత్రంలో బిగ్ బి కి మంచి స్నేహితురాలిగా కనిపించింది.. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈమె తాజాగా తనకు నిశ్చితార్థమైనట్లు ప్రకటించింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు అన్నీ కూడా తన ఇన్స్టాలో పంచుకుంది.
ఇది చూసిన ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే ఆమె స్నేహితులతో పాటు అవికా గోర్ , నవిక కోటియా నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్విని ఎమ్మెస్ ధోని ది అన్ టోల్డ్ స్టోరీ చిత్రంలో కూడా భాగమైంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన ఈ చిత్రంలో జయంతి అనే పాత్రను పోషించింది. ఆ తర్వాత సిఐడి, జిందగీ కట్టి మితి వంటి టీవీ షోలో కూడా పనిచేసింది.