భార్యాభర్తలు ఇద్దరు పీఎం కిసాన్ డబ్బులు పొందవచ్చా? ఎలా అప్లై చేసుకోవాలంటే..

-

రైతుల అభివృద్ధి కోసం ప్రధాన మంత్రి ప్రవేశపెట్టిన పథకాల లో ఒకటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి..ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాకు సంవత్సరానికి రూ. 6000 అందిస్తోంది. అంటే 2000 రూపాయలు మూడు విడతలలో చెల్లిస్తుంది..

అయితే ఇప్పటి వరకు ఈ పథకంలో చాలా మార్పులు వచ్చాయి. కొన్నిసార్లు దరఖాస్తుకు సంబంధించి, కొన్నిసార్లు అర్హత గురించి అనేక కొత్త నియమాలు రూపొందించారు. ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనం పొందవచ్చా అని అడుగుతున్నారు. వాస్తవానికి పీఎం కిసాన్‌ స్కీమ్‌ నియమాల గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

పీఎం కిసాన్ యోజన నియమాల ప్రకారం.. భార్యాభర్తలిద్దరూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాన్ని పొందలేరు. ఎవరైనా ఇలా చేస్తే ప్రభుత్వం అతడి నుంచి డబ్బులు రికవరీ చేస్తుంది. అతడ్ని ఫేక్ అంటోంది. అనర్హులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే వారు అన్ని వాయిదాలను ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలి. ఈ పథకం నిబంధనల ప్రకారం రైతు కుటుంబంలో ఎవరైనా పన్ను చెల్లిస్తే, ఈ పథకం ప్రయోజనం ఉండదు..భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరు ఆదాయపు పన్ను చెల్లించి ఉంటే వారు ఈ పథకం ప్రయోజనం పొందలేరు.

రైతు తన వ్యవసాయ భూమిని వ్యవసాయ పనులకు ఉపయోగించకుండా ఇతర పనులకు వినియోగిస్తే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అర్హులు కారు. ఒక రైతు వ్యవసాయం చేస్తున్నప్పటికీ పొలం అతని పేరు మీద కాకుండా అతని తండ్రి లేదా తాత పేరు మీద ఉంటే అతడికి ఈ పథకం ప్రయోజనం ఉండదు. ప్రభుత్వ ఉద్యోగి లేదా పదవీ విరమణ చేసిన, సిట్టింగ్ లేదా మాజీ ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి అయితే అలాంటి వారు కూడా ఈ పథకానికి అనర్హులే. ప్రొఫెషనల్ రిజిస్టర్డ్ డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు లేదా వారి కుటుంబ సభ్యులు కూడా ఈ పథకానికి అనర్హులు.. కుటుంబంలో ఒకరు మాత్రం ఈ లబ్దిని పొందుతారు…

Read more RELATED
Recommended to you

Exit mobile version