అగ్నిపథ్ కు రికార్డ్ స్థాయిలో దరఖాస్తుల వెల్లువ

-

కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన అగ్నిపధ్ పథకానికి దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తోంది. భారత వాయుసేన లో ఖాళీలకు 7.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. భారత వాయుసేన చరిత్రలో ఇంత అత్యధిక స్థాయిలో దరఖాస్తులు రావడం ఇదే తొలిసారి అని చెప్పారు. భారత వాయుసేన అగ్నిపథ్ రిజిస్ట్రేషన్ కు దరఖాస్తుల ప్రక్రియ జూన్ 24న ప్రారంభం కాగా.. జూలై 5 తో ముగిసింది. వాయుసేన లో అగ్నివీర్ తొలి బ్యాచ్ ను ఈ ఏడాది డిసెంబర్ 11న ప్రకటించనున్నారు.

అయితే ఈ పథకం కింద మహిళలకు తగిన ప్రాధాన్యం దక్కనుందని తెలుస్తోంది. నావికాదళంలో దీనికింద మొదటి బ్యాచ్ లో 20 శాతం మంది వరకు మహిళలు ఉంటారని భారత నేవీ అధికారులు మీడియాకు వెల్లడించారు. నావికాదళం ప్రకటించిన అర్హతలను వారు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ ఏడాది మూడు వందల మంది అగ్ని వీరులను నియమించుకోవాలని భావిస్తున్నామని, ఇందులో మహిళలు కూడా ఉంటారని ఇటీవల నేవీ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version