క్షణాల్లో లోన్…ఇలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు..!

-

డబ్బులు కావాలా..? పర్సనల్ లోన్ ని తీసుకోవాలని అనుకుంటున్నారా..? లోన్ కోసం ఎక్కువ సమయం పడుతుందని ఆలోచిస్తున్నారా..? అయితే మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… క్రెడిట్ కార్డు లోన్ ద్వారా ఈజీగా లోన్ తీసుకోవచ్చు.

చాలా మంది ఎక్కువగా క్రెడిట్ కార్డ్స్ ని వాడుతూ వుంటారు. వాళ్ళు ఈజీగా లోన్ తీసుకోవచ్చు. అర్హత కలిగిన వారికి ప్రిఅప్రూవ్డ్ క్రెడిట్ కార్డు లోన్స్ ఆఫర్ చేస్తుంటాయి. ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఈజీగా లోన్ తీసుకోవచ్చు. మూడు స్టెప్స్‌లోనే లోన్ పొందొచ్చు. 12 నెలల నుంచి 60 నెలల వరకు ఈఎంఐ ని ఈ లోన్ కోసం పెట్టచ్చు. ప్రాసెసింగ్ ఫీజు రూ. 999 ఉంటుంది.

లోన్ టెన్యూర్ పెరిగితే ఈఎంఐ కూడా తగ్గుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు వారికి ప్రి అప్రూవ్డ్ క్రెడిట్ కార్డు లోన్ ఆఫర్ ఉంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మీరు టెన్యూర్ ని సెలెక్ట్ చేసుకుంటే డబ్బులు అకౌంట్‌లోకి వచ్చేస్తాయి. క్రెడిట్ కార్డు లోన్ పై వడ్డీ రేటు 11.88 శాతం నుంచి స్టార్ట్ అవుతుంది. గరిష్టంగా 20.52 శాతం వరకు వడ్డీ పడొచ్చు.

రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
మీ క్రెడిట్ కార్డు నెంబర్‌ లోని చివరి నాలుగు నెంబర్లను ఎంటర్ చేయాలి.
ఓటీపీ వస్తుంది.
నెక్స్ట్ మీరు పేజ్‌లో లోన్ ఆఫర్ కనిపిస్తుంది.
లోన్ యొక్క అమౌంట్ ఓకే చెయ్యాలి.
ఇప్పుడు మళ్ళీ ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేయాలి.
లోన్ డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతాయి.
లోన్ ప్రిక్లోజ్ లేదా ఫోర్ క్లోజ్ చేయాలంటే చార్జీలు పడతాయి.
క్రెడిట్ కార్డ్ లోన్ తీసుకునే ముందు చార్జీలు చెక్ చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version