తమిళనాడు రాష్ట్రంలో తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం సీఎం స్టాలిన్ కు మరియు రాష్ట్ర గవర్నర్ ఆర్ ఎన్ రవికి మధ్యన విభేదాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తమిళనాడులో ఐటీ శాఖా దాడులు చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఇందులో మనీ లాండరింగ్ కు పాలడ్డారని ఆధారాలు దొరకడంతో మంత్రి సెంథిల్ బాలాజీని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కారణంగా రాష్ట్ర గవర్నర్ సెంథిల్ బాలాజీని మంత్రి వర్గం నుండి తొలగించారట. కానీ ఈ విషయం పట్ల రాష్ట్ర సీఎం స్టాలిన్ సుముఖంగా లేకపోవడంతో వివాదం మొదలైంది. అస్సలు గవర్నర్ కు మంత్రిని బర్తరఫ్ చేసే అధికారం లేదని స్టాలిన్ చెబుతున్నారు. ఈ విషయంలో మేము న్యాయపరంగా కోర్ట్ లో పరిష్కరించుకుంటామని చెప్పారు. ఇప్పుడు అందరూ రాజ్యాంగాన్ని చూడడం మొదలు పెట్టారని చెప్పాలి.