చంద్రబాబు, YSR ఇద్దరూ కలిస్తే సీఎం కేసీఆర్ అంటూ KTR ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్… ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడుకి ప్రో బిజినెస్, ప్రో ఐటీ ఇమేజ్ అజెండా ఉండేదని వెల్లడించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ప్రో ఫార్మర్, ప్రో పూర్, ప్రో రూరల్ ఇమేజ్ ఉండేదన్నారు.
కేసీఆర్ ప్రభుత్వానికి ఈ రెండు ఇమేజెస్ ఉన్నాయని చెప్పారు మంత్రి కేటీఆర్. అందుకే చంద్రబాబు, YSR ఇద్దరూ కలిస్తే సీఎం కేసీఆర్ అంటూ KTR ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఅర్ సీఎం అయ్యాకే తెలంగాణ అభివృద్ధి జరిగిందని తెలిపారు. సంక్షో భాన్ని పారద్రోలి….సంక్షేమాన్ని మోసుకొచ్చిన ఘనత మాదన్నారు మంత్రి కేటీఆర్. సిగ్గుతెచ్చుకుని ఢిల్లీ దాకా ముక్కు నేలకు రాయండని బీజేపీ,కాంగ్రెస్ లకు చురకలు అంటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నిక ల్లో 95 నుంచి 100 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్.