కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా అనేక మంది ఇబ్బందులకి గురయ్యారు. వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవడానికి కూడా ఎన్నో సమస్యలు వస్తున్నాయి. అయితే IIM, NIT Alumni కలిసి ఒక మొబైల్ బేస్డ్ అప్లికేషన్ ని డెవలప్ చేశారు. దీని ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
ఈ యాప్ పేరు ‘లొకాలిటీ io ‘. ఈ యాప్ ని ఉపయోగించడం వల్ల 18 ఏళ్ల నుండి 44 ఏళ్ల వయసు వారికి ప్రయోజనం కలుగుతుంది. ఇలా వ్యాక్సిన్ వేయించుకోవాలి అనుకునే వాళ్ళు దీనిని ఉపయోగిస్తే ఏ ఇబ్బందులు లేకుండా వ్యాక్సిన్ స్లాట్ బుక్ చెయ్యచ్చు.
స్లాట్ ని బుక్ చేసుకోవడానికి, నోటిఫికేషన్స్ రావడానికి ఉపయోగపడుతుంది. ఈ యాప్ ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నోలజీ అలానే IIM కలిసి అభివృద్ధి చేయడం జరిగింది. ఈ ఆప్ మే 1న విడుదల అయింది.
మే 6 నాటికి 10 వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు. దీని వల్ల ఇబ్బందులు ఏమీ లేకుండా సులువుగా ఉపయోగించడానికి వీలవుతుంది. ఈ యాప్ ని ఓపెన్ చేయగానే కోవిన్ లో వుండే సమాచారమే వస్తుంది. రిజిస్టర్ అయ్యి ఈ యాప్ లో వ్యాక్సిన్ కి సంబంధించి సమాచారం పొందొచ్చు. అలానే స్లాట్ కూడా బుక్ చెయ్యచ్చు.