పచ్చి కూరగాయల జ్యూస్ ని తీసుకోవచ్చా..? ఆరోగ్యానికి మంచిదేనా..?

-

పచ్చి కూరగాయల లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్స్, మినరల్స్ మొదలైన పోషకపదార్థాలు పచ్చి కూరగాయల ద్వారా మనం పొందొచ్చు. పైగా ఇవి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.

 

కానీ పోషక పదార్థాలు సమృద్ధిగా ఉన్నాయి కదా అని అధికంగా తీసుకోకూడదు. దీని వల్ల అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. పైగా ఇప్పుడు చలికాలం కూడా వచ్చేస్తోంది. ఆకుకూరలు ఎక్కువగా మనకి దొరుకుతూ ఉంటాయి. డైట్ లో వీటిని మనకి నచ్చిన విధంగా తీసుకోవచ్చు.

కొంతమంది పచ్చి కూరగాయల జ్యూస్లని తాగుతూ ఉంటారు అయితే పచ్చి కూరగాయలు కానీ కూరగాయల జ్యూస్లు కానీ అధికంగా తీసుకుంటే కొన్ని రకాల సమస్యలు కలుగుతాయి. అధికంగా వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు కలిగే అవకాశం ఉంది.

అధికంగా వీటిని తీసుకుంటే ఎందుకు హానికరం..?

అధికంగా పచ్చి కూరలు కానీ జ్యూస్లను కానీ తీసుకుంటే సులభంగా జీర్ణం అవ్వదు. వండినవి బాగా జీర్ణం అవుతాయి కానీ పచ్చివి బాగా జీర్ణం అవ్వవు. అందుకని లిమిట్ గా తీసుకుంటూ ఉండాలి.
వికారం, నీరసం, ఐబీఎస్ మొదలైన లక్షణాలు మీరు ఎదుర్కొంటే పచ్చి కూరగాయలు తక్కువ తీసుకోండి. చల్లటి పదార్థాలు కూడా తీసుకోకూడదు. వీటి వల్ల సమస్యలు వస్తాయి.

కూరగాయల్ని సరైన పద్ధతిలో ఎలా తీసుకోవాలి..?

కూరగాయల్ని ఉడికించి మాత్రమే తీసుకోవాలి తక్కువ నూనె లేదా నెయ్యి వేసి కొద్దిగా స్పైసెస్ ని వేసి తీసుకోవచ్చు. కావాలంటే ఆకుకూరలతో పప్పు, సూప్ వంటివి చేసి తీసుకోవచ్చు.

ఈ పచ్చికూరగాయలు అస్సలు తీసుకోకండి:

పచ్చి తోటకూర, కాలీఫ్లవర్, కలే, క్యాబేజీ, బ్రోకలీ వంటి వాటిని పచ్చిగా తీసుకోవద్దు.

ఈ కూరగాయల్ని పచ్చిగా తీసుకోవచ్చు:

అల్లం, క్యారెట్లు, పార్స్లీ, బీట్ రూట్, వీట్ గ్రాస్ వంటివి పచ్చివి అయినా తీసుకోవచ్చు సమస్యలు ఉండవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version