ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మొసలి తల కలకలం రేపింది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ అరుదైన మొసలి తల గుర్తించింది భద్రతా సిబ్బంది. ఢిల్లీ నుంచి కెనడా వెళుతున్నాడు కెనెడియన్ జాతీయుడు. ఈ తరుణంలోనే…ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మొసలి తల కలకలం రేపింది. బోర్డింగ్ పాస్ తీసుకొని బ్యాగేజ్ చెకింగ్ కోసం భద్రతా సిబ్బంది వద్దకు వెళ్లాడు ప్రయాణీకుడు.
అయితే… .స్కానింగ్ లో అనుమానాస్పదంగా కనిపించింది ఓ ప్యాకింగ్. ఇక ఆ ప్యాకింగ్ లో అరుదైన మొసలి తల ప్రత్యక్షం అయింది. దీంతో ఆ ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకోని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు పోలీసులు. Wild life protection యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్…దీనిపై విచారణ చేస్తున్నారు.